తెలుగు పద్య కమలాలు- వినూత్న తరగతిగది అలంకరణ (A Colourful Display of Poems in the Classroom)
తరగతి గదిని రంగురంగుల భోధనోపకరణ సామగ్రితో అలంకరించడం, విద్యార్థుల అభ్యసనాన్ని ఆసక్తికరంగా మరియు ఆహ్లాదకరంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో, కాగితపు కమలం రూపకల్పన అనేది ఒక వినూత్న ఆలోచనని నా అభిప్రాయం. పద్యాలను కమలం రేకులపై రాయడం, వాటి భావాలను ఆకుపచ్చ ఆకులపై వివరించడం ద్వారా విద్యార్థులు విషయాలను నేర్చుకోవడం ఒక సృజనాత్మక ప్రక్రియగా మరియు కళగా భావిస్తారు. ఇది కేవలం క్లాస్‌రూమ్ అందాన్ని పెంచడమే కాకుండా, పాఠ్య విషయాలను మరింత ఆకర్షణీయంగా, సులభంగా గ్రహించదగినదిగా చేస్తుంది. అలాంటి అనుభవాత్మకమైన శిక్షణా పద్ధతులు ఎలా ప్రయోజనకరంగా ఉంటాయో తెలుసుకుందాం మరియు చేద్దాము.
క్లాస్‌రూమ్ లో అలంకరణ కోసం కాగితపు కమలం తయారీ విధానం:
కావలసిన సామగ్రి:
- రంగురంగుల చార్ట్ పేపర్లు (కమలం రేకుల కోసం గులాబీ రంగు, ఆకుల కోసం ఆకుపచ్చ రంగు)
- కత్తెర
- గ్లూ లేదా టేప్
- దారాలు లేదా తాడు
- మార్కర్లు లేదా స్కెచ్ పెన్లు
- అలంకరణ సామగ్రి (ఐచ్చికం)
- మేకులు (దారాన్ని తగిలించడానికి అవసరమైతే)
కమలం డిజైన్ తయారు చేయడం:
- గులాబీ రంగు చార్ట్ పేపర్‌పై కమలం రేకుల ఆకారంలో పత్రాలను గీయండి మరియు కత్తిరించండి. ప్రతి పువ్వు పద్య పాదాలు రాయడానికి సరిపడా పెద్దగా ఉండాలి.
- ఆకుపచ్చ చార్ట్ పేపర్ పై ఆకుల ఆకారంలో పత్రాలను కత్తిరించండి. ఈ ఆకులపై పద్యం యొక్క భావాన్ని రాయాలి.
- కమలం కాడ మరియు చిన్న అలంకరణ అంశాలను జోడించండి, ఇది కమలాన్ని మరింత అందంగా చేస్తుంది.
విషయం రాయడం:
- ప్రతి పువ్వుపై తెలుగులో పద్య పాదాలు స్పష్టంగా మరియు అందంగా రాయండి.
- ఆయా పద్యాలకు సంబంధించిన భావాన్ని ఆకుపచ్చ ఆకులపై రాయండి.
కమలం కలిపి తయారు చేయడం:
- రేకులను మధ్యలో ఒక వృత్తాకార కేంద్రము చుట్టూ జతచేయండి, ఇది కమలం ఆకారాన్ని ఇస్తుంది.
- పువ్వులను కింద ఆకులను అతికించి, ప్రతి పువ్వుకు అనుసంధానంగా ఉన్న భావం సరిగ్గా కనిపించేటట్లు ఏర్పాటు చేయండి.
- కమలాన్ని దారంతో చేర్చుకుని, దారాన్ని అలంకరణ అంశాలతో జోడించండి.
క్లాస్‌రూమ్ లో ప్రదర్శించడం:
- కమలాన్ని విద్యార్థులు సులభంగా చదువుకునేలా తరగతిగదిలో అందుబాటులో ఉండే విధంగా ఎత్తులో తగిలించండి.
- బ్లాక్‌బోర్డు పక్కన, సబ్జెక్ట్ కార్నర్స్ లేదా చదువుకోనే ప్రదేశాల్లో ప్రదర్శించండి.
ఈ అలంకరణా ప్రక్రియ ప్రాముఖ్యత మరియు అవసరం:
భావ పఠన సామర్థ్యాలు మెరుగుపరచడం:
- ఇలాంటి సృజనాత్మక ప్రదర్శనలు విద్యార్థులలో ఆసక్తి పెంచి, పద్యాలును నేరుగా, ఆనందంగా చదివించేందుకు ప్రోత్సహిస్తాయి.
- భావాన్ని జోడించడం ద్వారా పద్యాన్ని సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది.
క్లాస్‌రూమ్ అందం:
- రంగుల కాగితపు కమలాలతో క్లాస్‌రూమ్ ను రమణీయంగా, సజీవంగా మార్చడం ద్వారా విద్యార్థులలో పాఠాలపై ఆసక్తి రేకిత్తిస్తుంది.
స్వీయ విశ్లేషణ అవకాశం:
- మళ్లీ మళ్లీ పద్యాలు చదవడం ద్వారా భావాలును విశ్లేషించుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.
సృజనాత్మకత మరియు కళాత్మక కలయిక:
- కళ మరియు సాహిత్యాన్ని కలపడం వలన విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించవచ్చు.
భాష మరియు సంస్కృతి అభివృద్ధి:
- తెలుగు కవితలతో భాషాపై ప్రేమను, సంస్కృతి పై అవగాహనను విద్యార్థుల్లో పెంపొందిస్తుంది.
సహకార భావన అభివృద్ధి:
- ఇలాంటి పనులలో విద్యార్థులను కలుపుకొని చేయడం ద్వారా వారికి సహకార భావన మరియు టీమ్‌వర్క్ యొక్క ప్రాధాన్యతను నేర్పుతుంది.
Next Post »
Comments