కవిత్రయం- Class 5th Telugu TLM- నన్నయ, తిక్కన , ఎర్రన- తెలుగు వినూత్న భోధనాభ్యసన పుస్తకం

Subject: Telugu (తెలుగు)

Class: 5th

Topic: కవిత్రయం   (నన్నయ, తిక్కన , ఎర్రన)

 “తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి” అనే సామెత విన్నారు కదా! మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు.

కవిత్రయం- Class 5th Telugu TLM- నన్నయ, తిక్కన , ఎర్రన- తెలుగు వినూత్న భోధనాభ్యసన పుస్తకం - AP BOARD TEXT BOOKS- TELUGU

 ఈ ముగ్గురు రచయతలు గురించి సులభంగా, వినూత్నగా వివరించుటకు మరియు బోధించుటకు మహాభారత పుస్తక రూపంలో ఈ  భోధనాభ్యసన పుస్తకం తయారు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్దులకు మహాభారత రచయతులు నన్నయ, తిక్కన , ఎర్రన గురుంచి అర్ధవంతంగా వివరించవచ్చు.



ఈ భోధనాభ్యసన పుస్తకంలో ఈ ముగ్గురు రచయతలు తో పాటు మహాభారత కథలో గల ప్రధాన పాత్రలైన, శ్రీకృష్ణుడు, పాండవులు (ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు) మరియు కౌరవులు (దుర్యోధనుడు మరియు అతని సోదరులు) చిత్రాలను చేర్చి ఈ భోధనాభ్యసన పుస్తకం తయారు చేయబడింది. దీనివలన విద్యార్దులు కవిపరిచయం తో పాటు మహాభారత ఇతిహాసం గురుంచి అవగాహన పెంపొందించుటకు సులభతరం అవుతుంది. 

కవిత్రయం:

1. నన్నయ్య:

నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దనికి చెందినవాడు. ఆరాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్య ను ‘అదికవి’ అంటారు. ఈయనకు ‘వాగనుశాసనుడు’ అనే బిరుదు కూడా ఉంది.


2. తిక్కన:

తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ది వద్ద మంత్రిగా ఉండే వాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో విరాటపర్వం మొదలు పదిహేను పర్వాలు రాశాడు. ఈయనకు ‘కవి బ్రహ్మ’ ఉభయకవి మిత్రుడు’ అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ అనే మరో కావ్యం కూడా రాశాడు.

3. ఎర్రన:

ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండే వాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్యపర్వంలో నన్నయ రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహపురాణం కూడా రాశాడు. ఈయనకు ‘ప్రబంధ పరమేశ్వరుడు’ ‘శంభుదాసుడు’ అనే బిరుదులున్నాయి.

Previous Post
«
Next Post
»

Comments

Popular posts from this blog

"Our Needs - Water" - Lesson plan and activities

The Best Christmas Present in the World- NCERT English Lesson Plan and Interactive Activities

"Neighbourhood! - Lesson plan and interactive activities to teach about public places and safety and hygiene in the neighbourhood"