AP Board Class 5th Telugu Lesson ఇటీజ్ పండుగ TLM and Video
పాఠం: ఇటీజ్ పండుగ
తరగతి: 5 వ తరగతి
AP Board Class 5th Telugu Lesson ఇటీజ్ పండుగ TLM
ఇటీజ్ పండుగ పాఠం, పిల్లలకు ఆసక్తిగా వివరించుటకు, పాఠంలో ఉన్న సన్నివేశాలని దృశ్యమాలికగా విద్యార్దులుకు చూపించుటకు ఈ క్రింది భోదనా చిత్రాలను తయారుచేయడం జరిగింది. నా తరగతిలో ఈ భోదనా చిత్రాలను ఉపయోగించి భోదన చేసాక విద్యార్దులు అందులో ముఖ్య పదాలను, (‘బోనం’ రొడ్డ కనుసు’...మొద:) పండుగ రోజుల్లో జరిగే కార్యక్రమాలును వాళ్ళు ఊహించుకొని అర్ధం చేసుకొనేందుకు చాలా ఉపయోగపడినవి.
Andhra Pradesh AP Board Lessons, TLM, Worksheets, and Quizzes 8th lesson ఇటీజ్ పండుగ Text Book Lesson and Story Telling TLM and Video.
ఇది విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మన్యం గిరిజనులు జరుపుకునే పండుగ. సంవత్సరంలోని 12 నెలలో నాల్గవ నెల పేరు ‘విటిజ్’. ఈ నెలలో వారు జరుపుకునే పండుగ ‘ఇటీజ్’. ముందుగా గ్రామస్థులు ఒక సమావేశం పెట్టుకుంటారు. ఈ సమావేశంలో తరువాతి శుక్రవారం చాటింపు వేస్తారు. ఆ తరువాతి శుక్రవారం పండుగ జరుపుకుంటారు.
పండుగరోజు ఇంటి ముందు, గోడల పై ముగ్గులు వేసి _ గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. రైతులు నాగలి, మోకు, పలుపు తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి దేవుని దగ్గర పెడతారు. మామిడి కాయలు ముక్కలు చేసి బియ్యంతో కలిపి ‘బోనం’ వండుతారు. అది దేవునికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం, అన్నం, కూరలు, . వంటలు ఒకరికొకరు ఇచ్చుకుంటారు.
రెండొవ రోజు ‘రొడ్డ కనుసు’ చేస్తారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు, ‘కనుసు’ అంటే ఊరేగింపు. ఈ ఆకులు ఒంటికి కట్టుకుని, తలకు పక్షి ఈకలు పెట్టుకుని, ముఖం పై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకుని, రంగులు – బూడిద కలిపిన నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పెద్ద పనసకాయను జంతుతల ఆకారంగా చేసి దాని పైకి బాణాలు వేస్తూ ఆడుతూ,పాడుతూ ‘సంకుదేవుని” దగ్గరకు వెళతారు.
ప్రతి ఇంటి నుండి గుప్పెడు విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి సంకుదేవునికి నివేదన చేస్తారు. ఆ విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తరువాత ప్రతి ఇంటికి పంచుతారు. ప్రతి ఇంట్లో ఆ విత్తనాలను వారి వారి అసలు విత్తనాలలో కలుపుకుంటారు.
మూడు నుండి ఆరు రోజుల్లో ఏదో ఒకరోజు గ్రామస్థులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్ళని వారిని వరసైన వారు ఎగతాళి చేస్తారు. ‘వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది”.
ఏడవరోజున అంటే చివరి రోజును “మారు ఇటీజ్” లేదా “నూరు ఇటీజ్” అంటారు. ఆరోజు దారికి అడ్డంగా వెదరు బొంగు కడతారు. వచ్చే పోయే వారికి ఆ వెదురు గోట్టాలతో వారి పై నీళ్ళు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊయలగా చేసి ఊగుతారు.
ఈ విధంగా మన్యం గిరిజనులు ‘ఇటీజ్’ పండుగ జరుపుతారు.
Comments